కృష్ణ గారు ఈ సినిమా చూసి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు... సుధీర్ బాబు సినిమా పై కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు కృష్ణ( Krishna ) గారు ఒకరు.ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినటువంటి ఘనత కృష్ణ గారికి మాత్రమే ఉందని చెప్పాలి.

 Netizen Shocking Comments On Sudheer Babu Hunt Movie , Sudheer Babu, Maama Masch-TeluguStop.com

ఇండస్ట్రీలో ఈయన నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నారు.ఇక వయసు పై పడటంతో కృష్ణ గారు సినిమాలకు దూరమయ్యారు.

ఇక గత ఏడాది ఈయన మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇక కృష్ణ అల్లుడిగా సుధీర్ బాబు ( Sudheer Babu ) కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

సుధీర్ బాబు పలు సందర్భాలలో కృష్ణ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.నా సినిమా విడుదలైన ప్రతిసారి మామయ్య మొదటి రోజే తన సినిమా చూసి తనకు ఫోన్ చేసి ఆ సినిమా ఎలా ఉంది అనే విషయాలను చెబుతారని సుధీర్ బాబు వెల్లడించారు.

అయితే తాజాగా ఈయన నటించిన మామ మశ్చీంద్ర ( Maama Mascheendra ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన హంట్ ( Hunt ) సినిమా గురించి కూడా ఒక ప్రశ్న ఎదురయింది.

Telugu Hunt, Krishna, Sudheer Babu-Movie

ఈ సినిమా విడుదల ఏ సమయానికి కృష్ణ గారు చనిపోయారు.అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది.అయితే ఈ సినిమా కనుక ఒకవేళ కృష్ణ గారు బ్రతికి ఉండి చూస్తుంటే ఆయన ఎలా స్పందించేవారు అనే ప్రశ్న సుదీర్ బాబుకు ఎదురవడంతో హంట్ అనే సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రమని తెలిపారు.

ఈ సినిమా కోసం నేను పడినటువంటి కష్టం పెట్టిన ఎఫర్ట్స్ చూసి మావయ్య కచ్చితంగా ప్రశంసించేవారు అంటూ సుధీర్ బాబు సమాధానం చెప్పారు.అయితే ఈయన చేసినటువంటి ఈ కామెంట్లపై ఒక నెటిజెన్ చేసిన కామెంట్స్ సుధీర్ బాబుకు తెగ కోపం తెప్పించాయని ఈయన వెల్లడించారు.

Telugu Hunt, Krishna, Sudheer Babu-Movie

ఇలా ఈ సినిమా గురించి ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒకవేళ హంట్ సినిమా కృష్ణ గారు చూసి ఉంటే ఈ సినిమా చూసి ఆయన తప్పకుండా ఆత్మహత్య చేసుకునే వారు అంటూ కామెంట్ చేశారు.అయితే ఆ వ్యక్తి అలా కామెంట్ చేయడంతో నాకు విపరీతమైనటువంటి కోపం వచ్చిందని, ఆ వ్యక్తిని కొట్టాలనే అంత కోపం వచ్చినప్పటికీ నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సుధీర్ బాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే సుధీర్ బాబుకి మామయ్య కృష్ణ అంటే ఎంతో ఇష్టం అనే విషయం పలు సందర్భాలలో వెల్లడించారు.ఇక తనకు కనుక మామయ్య గారి బయోపిక్ సినిమాలో చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటూ కూడా ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube