తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా జూనియర్ ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ తన రేంజ్ గురించి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునేలా చేసాడు.
తాజాగా కూడా మరోసారి తారక్ రేంజ్ గురించి మాట్లాడుకుంటున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.
తాజాగా హైదరబాద్ కు వచ్చిన నెట్ ఫ్లిక్స్ సీఈవో టెండ్ సరండోస్( Ted Sarandos ) మెగా ఫ్యామిలీతో భేటీ జరిపి మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్( Ram Charan ), సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో కలిసి ముచ్చటించిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ని కలిశారు టెండ్.నేడు మధ్యాన్న భోజనానికి జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం మీద టీమ్ తో సహా అక్కడికి వెళ్లి సమావేశం కావడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది.ఆర్ఆర్ఆర్ స్టార్లలో ఒకరిని కలిసి ఇంకొకరిని కలుసుకోకపోవడం పట్ల కొందరు ఫ్యాన్స్ ఎలాంటి అర్థాలు తీస్తారో సోషల్ మీడియా జనాలకు అలవాటైన వ్యవహారమే.
తారక్ తో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్, దేవర దర్శకుడు కొరటాల శివ కూడా ఈ మీటింగ్ లో పాలు పంచుకున్నాడు.ఏ విషయాలు చర్చించారు.
ఏ ప్రతిపాదనలు డిస్కస్ చేసుకున్నారు లాంటివేవి ప్రస్తుతానికి బయటికి రాలేదు.టెడ్ మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీస్ ని కలుసుకోవడం సీరియస్ అజెండాగా పెట్టుకున్నారు.ట్రిపులార్ స్టార్స్ ని కలుసుకున్నప్పుడు దర్శకుడిని మాత్రం వదులుతారా.రేపు రాజమౌళితో మీటింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు.అదే జరిగితే కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షత్, కాల భైరవల కలయికకు కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు.అయితే అసలు టెడ్ ముందు హైదరాబాద్ ఎందుకు వచ్చాడనేది మాత్రం బయటికి రావడం లేదు.
ఇండియాలో సబ్స్క్రైబర్స్ ని పెంచుకునే అంశం గురించి ఇక్కడి టీమ్ తో సీరియస్ మంతనాలు జరగబోతున్న నేపథ్యంలో పలువురు స్టార్లను కలవడం ద్వారా వాళ్ళ పల్స్, అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడట.అయితే నెట్ ఫ్లిక్స్ సీఈఓ ఎన్టీఆర్ ని కలవడం ప్రస్తుతం అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.