నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుండడంతో వైసీపీలో అతని ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది.తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఆరోపించిన ఒక రోజు తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కోటంరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని సంప్రదించారని, ప్రస్తుతం 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌తో కూడా మాట్లాడారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌పై కోటంరెడ్డి నాయుడు, లోకేష్‌ల నుంచి హామీ లభించిందని వినికిడి.

ఇటుపక్క వైసీపీలో కోటంరెడ్డి తన పవర్ ను కోల్పోవడానికి సిద్ధంగా లేరని, ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ సుముఖంగా లేదని తెలిసింది.దీంతో పాటు వైసీపీ, తన పట్ల అనుసరిస్తున్న వైఖరితో కోటంరెడ్డి విసిగిపోయారు.ఫోన్ ట్యాపింగ్ ఆరోపణపై వైసీపీ అధినాయకత్వం స్పందించకపోవడంతో కోటంరెడ్డి సీఎం జగన్ లేదా సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి కాల్ వస్తుందని ఎదురు చూస్తున్నారు.కానీ అలాంటిదేమీ జరగలేదు.

కోటంరెడ్డి వివాదంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడాన్ని ఖండించారు.“కోటంరెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యేల ఫోన్‌లు ట్యాప్ చేయడం వల్ల మాకు ఏం వస్తుంది.ఇలాంటి ప్రకటనలు అనవసరం.మాకు అంతర్గత విభేదాలు ఉండవచ్చు అవి కాఫీ కప్పులో తుఫానులా కాలక్రమేణా తొలగిపోతాయి,” అని మంత్రి కాకాణి అన్నారు.కానీ కోటంరెడ్డి మాత్రం గత ఎన్నికల్లో తీవ్ర పోటీ మధ్య మంచి మెజారిటీతో విజయం సాధించాడు.కానీ జగన్ మాత్రం ఈ సారి చేస్తున్న ప్రక్షాళనలో ఇతనికి టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చుపట్లేదట.
ఏది ఏమైనప్పటికీ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో కోటంరెడ్డి టీడీపీలో చేరతారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
