ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తలరాత మారదా..? పాండ్య పై పెరిగిన నేగిటివిటీ...

ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్( IPL 17 ) చాలా రసవత్తరంగా సాగుతుంది.నిజానికి ఈ సీజన్ లో ప్రతి ప్లేయర్లు కూడా తన దైన రీతిలో ప్రతిభను కనబరుస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 Negativity On Captain Hardik Pandya Effecting Mumbai Indians Team Performance De-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే కొన్ని జట్లు మాత్రం డీలా పడిపోయి ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేక టోర్ని లో వెనకబడిపోతున్నాయి.ఇక ఇలాంటి క్ర ముంబై ఇండియన్ టీమ్ కి( Mumbai Indians ) ఈ సంవత్సర అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి.

వరుసగా ఆడిన 3 మ్యాచ్ ల్లో మూడు ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరి ప్లేస్ లో కొనసాగుతుంది.ఇక రోహిత్ శర్మ( Rohit Sharma ) లాంటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ ను పక్కన పెట్టి హార్థిక్ పాండ్యని( Hardik Pandya ) టీమ్ లోకి తీసుకొని ఆయన్ని కెప్టెన్ చేయడంతో టీం ఇలా భారీగా నష్టపోవాల్సి వస్తుందంటూ పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నిజానికి ఈ సీజన్ లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే బాగుండేదని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ ముంబై టీమ్ యాజమాన్యం మాత్రం అలా చేయకుండా హర్థిక్ పాండ్య ను కెప్టెన్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తుంది అంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.ఇక నిన్న రాజస్థాన్ రాయల్స్ తో( Rajasthan Royals ) ఆడిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది.ముంబై టీమ్ లో బ్యాట్స్ మెన్స్ ఎవరూ కూడా రాణించకపోవడంతో నిర్ణీత 20వ ఓవర్లకి 125 పరుగులు మాత్రమే చేసింది.ఇక దాంతో రాజస్థాన్ ప్లేయర్స్ ఈజీగా ఆ పరుగులను ఛేదించి ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు…ఇక మొత్తానికైతే పాండ్య మీద భారీ దెబ్బ పడే అవకాశం అయితే ఉంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube