వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు..!

ఇప్పటివరకు త్రిబుల్ సెంచరీలు కేవలం టెస్ట్ క్రికెట్ లో మాత్రమే చూసాం.కాకపోతే తాజాగా వన్డేలలో కూడా త్రిబుల్ సెంచరీ రికార్డ్ నమోదయింది.

 Recorded The First Triple Century In Odis, Triple Century, First Triple Century,-TeluguStop.com

ఆదివారం నాడు బీహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన రణధీర్ వర్మ అండర్ 19 వన్డే మ్యాచ్ లలో భాగంగా సమస్తిపూర్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ట్రిపుల్ సెంచరీ( Vaibhav Suryavanshi ) చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టినట్టు అయింది.ఇదివరకు 2002 లో కౌంటీ ఫస్ట్-క్లాస్ వన్డే మ్యాచ్‌ లో సర్రే తరపున అలీ బ్రౌన్ గ్లామోర్గాన్‌ పై ఏకంగా 268 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు.ఇక మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్ ఒక వన్డేలో చేసిన 264 పరుగుల రోహిత్ శర్మ( Rohit Sharma ) రికార్డును తాజాగా జరిగిన వన్డే మ్యాచ్ లో బ్రేక్ అయింది.

ఇక వన్డే క్రికెట్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా భారతీయ క్రికెటర్ వైభవ్ రికార్డు నెలకొన్నాడు.ఇకపోతే ఈ వన్డే ఫార్మేట్ లో ఇప్పటివరకు ఒకే ఒక్క ట్రిపుల్ సెంచరీ నమోదు కావడం జరిగింది.జూన్ 14, 2022న ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీఫెన్ అంధుల క్రికెట్ టోర్నమెంట్లో స్టీఫెన్ నీరో బ్రిస్బేన్‌ లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే క్రికెట్‌లో 140 బంతుల్లో 309 పరుగులతో అజయంగా నిలిచాడు.దీంతో తాజాగా భారతీయ కుర్రోడు వైభవ్ సూర్యవంశి 332 పరుగులు చేసినాడు.

దీంతో సమస్తిపూర్ సహర్సాను 281 పరుగుల తేడాతో ఓడించి రికార్డు సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube