ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో సన్నాఫ్ ఇండియా సినిమా గురించి దారుణంగా ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే.ఆ తర్వాత కూడా పలు సినిమాలను ట్రోల్ చేసినా ఆ సినిమాలు సక్సెస్ సాధించాయి కాబట్టి వాటిని ఎవరూ పట్టించుకోలేదు.
అయితే ఆచార్య సినిమాకు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.పూజా హెగ్డే నెగిటివ్ సెంటిమెంట్ అని అందువల్లే ఆచార్య ఫ్లాపైందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు కాజల్ ను ఈ సినిమా నుంచి తీసేసి ఆమెకు అన్యాయం చేశారని చెబుతున్నారు.రామరాజు లాంటి అద్భుతమైన పాత్రను చేసిన చరణ్ సిద్ధ లాంటి సాధారణ పాత్రకు ఎందుకు ఓటేశారని మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు వరుస విజయాలతో దూసుకెళుతున్న చరణ్, కొరటాల శివలకు దిష్టి తగిలిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కొందరు విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని చెబుతున్నారు.
కొరటాల పెన్ లో పదును తగ్గిందని మరి కొందరు చెబుతున్నారు.సినిమా స్లోగా ఉండటంతో నిద్రొచ్చిందని మరో నెటిజన్ కామెంట్లు చేశారు.
ఆచార్య సినిమాకు రెజీనా సాంగ్ పెట్టకుండా ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతుండటం గమనార్హం.ఆచార్య సినిమా యావరేజ్ గా ఉన్నా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతోంది.

కొంతమంది నెటిజన్లు మంచు విష్ణు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ కూడా ఆచార్య ఫ్లాప్ కు కారణమంటూ చెబుతుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో ఏ సినిమా గురించి జరగని స్థాయిలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం.







