Rajinikanth Chiranjeevi Balakrishna : రజనీకాంత్, చిరంజీవి, బాలయ్యలపై విమర్శలు న్యాయమా.. వాళ్ల కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాలంటూ?

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) నటించిన లాల్ సలామ్( Lal Salaam ) మూవీ థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లో ఏ సినిమా మిగల్చని స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

 Negative Comments About Rajinikanth Chiranjeevi Balakrishna Details-TeluguStop.com

రజనీకాంత్ వయస్సు ప్రస్తుతం 73 సంవత్సరాలు కాగా ఈ సినిమా విషయంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కూతురి కోసం రజనీకాంత్ కెరీర్ ను పణంగా పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆచార్య,( Acharya ) భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలు ఫ్లాపైన సమయంలో చిరంజీవిపై( Chiranjeevi ) కూడా విమర్శలు వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు కావడం గమనార్హం.

మరో స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) అఖండ సినిమాకు ముందు నటించిన సినిమాల విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి.బాలయ్య వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు కావడం గమనార్హం.

Telugu Acharya, Akhanda, Balakrishna, Bhola Shankar, Chiranjeevi, Lal Salaam, Ra

సాధారణంగా వయస్సు 60 సంవత్సరాలు దాటితే ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది.కానీ చిరు, బాలయ్య, రజనీ మాత్రం అభిమానించే అభిమానుల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు.ఇలాంటి హీరోల సినిమాలు ఒకటి రెండు ఫ్లాప్ అయితే విమర్శించడం ఎంతవరకు రైట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆయా హీరోల కష్టాన్ని అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Acharya, Akhanda, Balakrishna, Bhola Shankar, Chiranjeevi, Lal Salaam, Ra

చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ హీరోలు మరీ భారీ బడ్జెట్ తో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్ ఎంతో కష్టమైన యాక్షన్ సీన్స్ లో( Action Scenes ) నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

ఈ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఇతర భాషల్లో సైతం ఈ హీరోలు క్రేజ్ ను పెంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube