మనం జీవితంలో ఎంత ఎదిగినా మనం ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లీదండ్రులను, వాళ్ల గొప్పదనాన్ని మాత్రం మరిచిపోకూడదు.అయితే హీరో విజయ్ మాత్రం తల్లీదండ్రుల విషయంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ తల్లీదండ్రులకు గౌరవం ఇవ్వకపోతే వేస్ట్ హీరోనే అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ ఏడాది వారసుడు సినిమాతో విజయ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఈ మూవీ వల్ల నిర్మాత దిల్ రాజుకు భారీ స్థాయిలోనే ఆదాయం చేకూరింది.అయితే కొన్ని వారాల క్రితం ఒక ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ లో అందరినీ పేరుపేరునా పలకరించిన విజయ్ తన సొంత తల్లీదండ్రులను మాత్రం పలకరించకపోవడం హాట్ టాపిక్ అయింది.

అయితే విజయ్ తల్లీదండ్రులను మాత్రం సరిగ్గా పలకరించలేదు.అయితే ఈ ఘటన గురించి విజయ్ తల్లి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.వారిసు సినిమా ఈవెంట్ లో ఈ ఘటన జరిగిందని పెద్ద ఈవెంట్ జరిగిన సమయంలో నా కొడుకు గురించి అంతకు మించి ఏం కోరుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.విజయ్ తండ్రి గతంలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో చంద్రశేఖర్ పెట్టిన రాజకీయ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ కామెంట్లు చేశారు.తర్వాత రోజుల్లో విజయ్ కు అతని తండ్రికి గ్యాప్ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.విజయ్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో నటిస్తున్నారు.విజయ్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







