జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటన చేయడంతో 2024 ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో అనే చర్చ మొదలైంది.పవన్ చేసిన ప్రకటన టీడీపీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తే వైసీపీ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.2024 ఎన్నికల్లో టీడీపీకి( TDP ) అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే వైసీపీకి( YCP ) అనుకూలంగా వ్యవహరించే ఒక ఛానల్ (సాక్షి కాదు) పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ కథనాలను ప్రచారం చేస్తోంది.పవన్ కు ప్యాకేజ్ ఇవ్వడం వల్లే పొత్తుకు మద్దతు ఇచ్చారని ఆ కథనాల సారాంశం.అయితే ఆ కథనాల విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతే సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
ప్యాకేజ్ అని కామెంట్లు చేసేవాళ్లకు పవన్ గతంలోనే గట్టిగా జవాబిచ్చాడని చెబుతున్నారు.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనేది పవన్ ఇష్టమని పవన్ పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో ఎవరూ చెప్పలేరని ప్రజల మనస్సులో ఎవరికి ఓటు వేయాలని ఉంటే వాళ్లకే ఓటు వేస్తారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ పై విమర్శలు చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.
పవన్ అన్నీ ఆలోచించుకుని పొత్తు విషయంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.అయితే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉంటారో లేదో తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పటికే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.