భర్త చనిపోయాక పోస్ట్ పెట్టకూడదా.. పెడితే ఎంజాయ్ చేసినట్లేనా?

బాలీవుడ్ సీనియర్ దివంగత నటుడు రిషి కపూర్ మరణించిన విషయం అందరికీ విధితమే.ఈ కపూర్ మరణించి రెండేళ్లు అవుతోంది.

రిషి కపూర్ సతీమణి నీతూ కపూర్ గురించి కూడా మనందరికీ తెలిసిందే.భర్త మరణించిన తర్వాత ఆమె కొద్దికాలంపాటు డిప్రెషన్ లోకి వెళ్ళింది.

అంతేకాకుండా కొంతకాలం పాటు సోషల్ మీడియాలో పాటు ఎక్కడ యాక్టివ్ గా కనిపించకుండా కామ్ గా ఉంది.అయితే నీతూ కపూర్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.అయితే ఇదే విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

భర్త చనిపోయాడు అన్న బాధ లేకుండా ఇలా పోస్ట్ లు పెట్టి ఎంజాయ్ చేయటం ఏంటి? అంటూ ప్రశ్నించడంతో ఆ విషయంపై అసహనం వ్యక్తం చేసిన నీతూ కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.తన ఫాలోవర్స్ ను ప్రేమిస్తున్నానని.

తనను ట్రోల్ చేసే వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు వెల్లడించింది.అంతేకాకుండా భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని కొందరు అంటున్నారని, అయితే భర్త చనిపోతే తాను ఏడుస్తూ విధవల ఉండటాన్ని చూడాలి అనుకుంటున్నవారిని బ్లాక్ మెయిల్ చేస్తానని అని తెలిపింది.

యంగ్ హీరో అయిన రన్బీర్ కపూర్ కి నీతు కపూర్ తల్లి అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక తన భర్త రిషి కపూర్ గురించి నీతూ కపూర్ స్పందిస్తూ.తన భర్తను ఆమె మర్చిపోలేదట.రిషి కపూర్ జ్ఞాపకాలు ఇంకా ఆమె జీవితంలో ప్రభావాన్ని చూపుతున్నాయని.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

రిషీ కపూర్ ఎప్పుడూ నీతూ కుటుంబ సభ్యులతోనే ఉంటారు అని తెలిపింది.అంతేకాకుండా ఇప్పటికీ రిషి కపూర్ తనతోనే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది.

Advertisement

అలాగే కొడుకు రణ్ బీర్ కపూర్ కూడా ఇప్పటికీ మొబైల్ స్క్రీన్ పై రిషీ కపూర్ ఫోటోనే పెట్టుకున్నాడని, కాబట్టి ఆయనను మేము ఎంతగా మిస్ అవుతున్నాము అర్థం చేసుకోండి అని తెలిపింది నీతూ కపూర్.అలాగే రిషి కపూర్ ను మిస్ అవుతున్నందుక దిగులుగా లేదు.

మేము అతన్ని మిస్ కావటాన్ని కూడా సంతోషంగా భావిస్తున్నాం ఆయన తలుచుకున్న ప్రతీసారి ఎంతో గొప్ప వ్యక్తి అని అనుకుంటూ ఉంటాము అని చెప్పుకొచ్చింది నీతూ కపూర్.

తాజా వార్తలు