ఆఫ్గనిస్తాన్‌లో ఘోరం.. 80 మంది బాలికలపై విషప్రయోగం

ఆఫ్గనిస్తాన్‌లో( Afghanistan ) దారుణ పరిస్ధితులు నెలకొన్నాయి.అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు( Talibans ) అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

 Nearly Eighty Afghan Girls Hospitalised After School Poisoning Details, Afghanis-TeluguStop.com

ప్రజలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు.దీంతో ప్రజలు ఆంక్షల వలయంలోకి బ్రతుకున్నారు.

ముఖ్యంగా మహిళలు, బాలికలపై ఆంక్షలు మరింతగా పెరిగాయి.మహిళలు, పిల్లలపై దాడులు బాగా ఎక్కువైపోయాయి.

మహిళలు, బాలికలను చదువుకు దూరం చేసేలా తాలిబన్లు అనేక ఆంక్షలు విధిస్తున్నారు.ఎదురుతిరిగినవారిపై దాడులు చేపుడుతున్నారు.

Telugu Afghan, Afghanistan, International, Latest, Poison Attack, School, Taliba

తాజాగా ఆఫ్గనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది.ఒక పాఠశాలపై దాడి జరిగింది.ఈ దాడుల్లో 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది.ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాలికలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.అయితే దుండగులు ఎలాంటి విషపదార్థం ఉపయోగించారనేది ఇంకా బయటకు రాలేదు.సర్‌ ఎ పుల్ ప్రావిన్సు, సంగ్బారక్ జిల్లాలోని రెండు ప్రాథమిక స్కూళ్లల్లో ఈ విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత కక్షతోనే ఈ విషప్రయోగం జరిపినట్లు చెబుతున్నారు.ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాలికలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు విద్యాశాఖ అధికారి మహమ్మద్ రహమానీ స్పష్టం చేశారు.

Telugu Afghan, Afghanistan, International, Latest, Poison Attack, School, Taliba

దుండగులు ఎలాంటి విషపదార్థాలు( Poisoning ) ఉపయోగించారనే దానిపై విచారణ చేపడుతున్నట్లు మహహ్మద్ రహమానీ చెప్పారు.అయితే చికిత్స పొందుతున్న బాలికల గురించి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.దుండగులు విషప్రయోగం చేయడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.అయితే 2021లో ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని జేజిక్కించుకున్నారు.తాలిబన్లు వచ్చిన తర్వాత ప్రమాదకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.మహిళలు చదువుకోకుండా అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు.

అలాగే వారిపై దాడులు కూడా పెరిగిపోయాయి.స్కూళ్లు, కాలేజీల్లో దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.

దీంతో అక్కడ మహిళలు, బాలికలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.మహిళలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

అంతలా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube