వైరల్: ఎన్ఆర్డీఎఫ్ బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తిన 'తుర్కియే ఎయిర్‌పోర్ట్‌!'

తుర్కియే (టర్కీ)లో చాలా దారుణమైన భూకంపం కారణంగా అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో అక్కడి భూకంప బాధితులకు సహాయక చర్యలు అందించి స్వదేశానికి తిరిగి ప్రయాణం అయిన ఎన్ఆర్డీఎఫ్ బృందంపై అక్కడి ప్రజలు ప్రశంసలు జల్లు కురిపించారు.

ఆపరేషన్ దోస్త్ లో భాగంగా అందించిన సేవలకు కృతజ్ఞతగా "అదానా సకిర్పాసా ఎయిర్పోర్టు"లో స్థానికులతో పాటు అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రవేశ ద్వారానికి ఇరువైపులా నిల్చొని కరతాళ ధ్వనులతో మన భారతీయులకి వీడ్కోలు పలకడం ఎంతో ఆనందదాయకం.

కాగా, దీనికి సంబంధించిన వీడియోను NDRF ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భూకంపంతో తీవ్రంగా కంపించిన తుర్కియేకు సహాయ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం "ఆపరేషన్ దోస్త్"ను చేపట్టిన సంగతి తెలుసా? ఇందులో భాగంగానే భారత NDRF బృందాలతోపాటు, వైద్య సిబ్బందిని ఆ దేశానికి పంపారు.ఈ నేపథ్యంలో 51 మంది సిబ్బంది, 2 డాగ్ స్వాడ్లతో కూడిన NDRF సిబ్బంది పది రోజులపాటు తుర్కియేలో సహాయచర్యల్లో పాల్గొన్నాయి.

ఈ క్రమంలో ఎంతో మందిని భారత NDRF బృందాలు శిథిలాల కింద నుంచి వెలికితీశాయి.శిథిలాల కింద చిక్కుకున్న బెరెన్ అనే ఆరేళ్ల బాలికను భారత NDRF బృందంలోని రెండు శునకాలు అయినటువంటి రోమియా, జూలీ గుర్తించడం విశేషం.కాగా గురువారంనాడు వారు తిరిగి భారత్ కి తిరుగుపయనమైన సందర్భంగాలో వీడ్కోలు పలుకుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు NDRF బృందం సేవలను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఇప్పటి వరకు తుర్కియేలో సుమారు 36 వేల మంది, సిరియాలో 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.

డిసెంబర్ 31 లోపు అలా చేయాల్సిందే.. పాన్ కార్డ్ కొత్త రూల్స్..
Advertisement

తాజా వార్తలు