వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి.ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని( Modi Govt ) గద్దె దించాలని విపక్ష పార్టీలు కంకణం కట్టుకున్నాయి.
ఈ క్రమంలో “ఇండియా”( INDIA ) అనే కూటమి కూడా ఏర్పాటు చేయడం జరిగింది.చాలావరకు గతంలో కంటే ఈసారి జాతీయ స్థాయిలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే ఎన్సీపీ అధినేత శరద్ పవర్( Sharad Pawar ) బీజేపీతో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎట్టి పరిస్థితులలో బీజేపీ పార్టీతో( BJP ) పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు.బీజేపీతో ఎలాంటి బంధమైనా ఎన్సీపీ( NCP ) రాజకీయ విధానానికి సరిపోదని స్పష్టం చేశారు.శనివారం అజిత్ పవర్ తో రహస్య భేటీ గురించి స్పందిస్తూ.
ఇంటి సభ్యుడిగా మాత్రమే సమావేశమైనట్లు స్పష్టం చేశారు.ఇదే సమయంలో తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కొందరు తనను బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు.
కానీ ఈ విషయంలో తన వైఖరిలో మార్పు లేదని శరద్ పవర్ పేర్కొన్నారు.