నయన్ వెడ్డింగ్ టీజర్.. ఇది పెళ్లి వీడియో కాదు.. అంతకు మించి..

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

 Nayanthara Vignesh Shivan’s Wedding Teaser Released On Netflix, Nayanthara , V-TeluguStop.com

స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల చేత పిలుపించుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలుస్తుంది.

ఇక ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం విదితమే.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.

వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి విహహం జరుగగా.

ఈ వేడుకను సినిమాటిక్ రేంజ్ లో గౌతమ్ మీనన్ షూట్ చేసారు.ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాలేదు.

అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ వీరి పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకు రాబోతుంది.

నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే పేరుతో గౌతమ్ మీనన్ డాక్యుమెంటరీ రూపొందించారు.దీనికి సంబందించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేసి త్వరలోనే రాబోతుంది అంటూ తెలిపారు.ఈ వీడియో చుసిన వారంతా ఇది పెళ్లి వీడియో కాదు అంతకు మించి ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ డాక్యుమెంటరీ లో పెళ్లితో పాటు వీరి పరిచయం, జ్ఞాపకాలు, కెరీర్ అన్నిటిని చూపించ బోతున్నారని తెలుస్తుంది.ఫ్లాష్ లైట్స్ మరియు ఫేమ్ కు మించి నయనతార అనే కల ఉంది అని ఈమె సూపర్ స్టార్ డమ్ కి ఎదుగుతున్న కథను అందిస్తుంది అంటూ రాసుకొచ్చింది.

మరి టీజర్ ను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube