ఎట్టకేలకు తన పిల్లల పూర్తి పేర్లను రివీల్ చేసిన నయనతార... పూర్తి పేర్లు ఏంటో తెలుసా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanatara )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస సినిమాలలో నటిస్తున్న హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార పెళ్లి తర్వాత కాస్త సినిమాలను తగ్గించిందని చెప్పాలి.

 Nayantara Finally Revealed The Full Names Of Her Children Do You Know What The F-TeluguStop.com

పెళ్లి తర్వాత వెంటనే ఈమె ఇద్దరు కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనివ్వడంతో వారి బాధ్యతలు చూసుకుంటూ సినిమాలను తగ్గించారని చెప్పాలి.

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్( Jawan ) సినిమాలో నటిస్తున్నారు.ఇలా ఒకవైపు సినిమాలో చేస్తూనే మరొకవైపు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ బిజీగా మారిపోయారు.తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ లో నయనతార పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెను ఇంటర్వ్యూ చేశారు.అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా నయనతార కవల పిల్లల పూర్తి పేర్లను చెప్పాలి అంటూ యాంకర్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నయనతార తన పిల్లల పూర్తి పేర్లను మొదటిసారి రివీల్ చేశారు.

ఇలా నయనతార తన పిల్లల పేర్లను చెబుతూ తన మొదటి కుమారుడి పేరు ఉయర్ రుద్రోనిల్ ఎన్ శివన్ .రెండవ కుమారుడి పేరు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్ అంటూ క్యూట్‏గా చెప్పింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈమె గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan )ను ప్రేమిస్తూ తనతో కలిసి రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే గత ఏడాది జూన్ 9వ తేదీ వీరిద్దరు వివాహం చేసుకున్నారు.

అయితే వివాహమైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు.ఇలా తన కుమారుల పూర్తి పేర్లను రివిల్ చేసిన నయనతారను తన కుమారుల ఫేస్ కూడా రివీల్ చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube