టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో నయనతార విఘ్నేష్ శివన్ జంట ఒకటనే సంగతి తెలిసిందే.
మరికొన్ని గంటల్లో నయన్ విఘ్నేష్ పెళ్లి జరగనుండగా ఈ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఈ పెళ్లికి హాజరయ్యే అతిథులు సైతం డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుందని సమాచారం.మహాబలిపురంలో పెళ్లి అని ప్రకటించినా వివాహ వేదికకు సంబంధించిన వివరాలు మాత్రం అతిథులకు మినహా ఎవరికీ తెలియదని సమాచారం.
అయితే కాబోయే భర్తకు నయనతార ఖరీదైన ఇల్లును బహుమతిగా ఇవ్వనున్నారని సమాచారం.సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ ఇంటి ఖరీదు ఏకంగా 20 కోట్ల రూపాయలు అని ఈ ఇంటిని భర్త విఘ్నేష్ శివన్ పేరుపై నయనతార రిజిస్ట్రేషన్ చేయించనున్నారని సమాచారం అందుతోంది.
మరోవైపు విఘ్నేష్ శివన్ సైతం నయనతార కోసం ఖరీదైన నగలు కొనుగోలు చేశారని వాటిని విఘ్నేష్ బహుమతిగా ఇవ్వనున్నారని సమాచారం.వివాహం సందర్భంగా నయన్ విఘ్నేష్ ఒకరికొకరు కళ్లు చెదిరే కానుకలను ఇచ్చుకుంటూ ఉండటం గమనార్హం.
విఘ్నేష్ శివన్ నయనతారకు ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.పెళ్లి తర్వాత నయనతార బహుమతిగా ఇచ్చిన కొత్త ఇంట్లోనే విఘ్నేష్ నయనతార కాపురం పెట్టనున్నారని సమాచారం అందుతోంది.
పెళ్లి కోసం నయన్ విఘ్నేష్ దంపతులు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.
మరోవైపు పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల్లోనే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.నయనతార మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుని సినిమాల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.కెరీర్ విషయంలో నయనతార ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
నయనతారను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.నయన్ విఘ్నేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy