దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్.. 8 ఏళ్ల క్రితం పోయిన బైక్‌కు ఇప్పుడు చలాన్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెత వినే ఉంటారు.ఇది అక్షరాలా నిజమని నిరూపించే ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.

 Shocking News Now Challan For A Bike That Was Lost 8 Years Ago , Bike, News, Vi-TeluguStop.com

బైక్ చలాన్ చివరికి దొంగలను పట్టించింది.ఆ దొంగలు ఎవరో కాదు.

స్వయానా పోలీసులే.దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే.

బైక్ దొంగతనం కేసులో చిక్కుకున్నారు.న్యాయం చేయాల్సిన రక్షకభటులే దొంగలుగా ముద్ర వేసుకున్నారు.

ఎవరికైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్తారు.కానీ పోలీసులే బాధ్యత మరిస్తే ఏం చేయాలి? ఈ బైక్ దొంగతనం కేసుల్లో పోలీసుల పాత్ర చూస్తే ఎవరైనా అవాక్కవుతారు.

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తికి సంబంధించిన బైక్ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం చోరీకి గురైంది.దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన బైక్ ను చోరీ చేసిన దొంగలను పట్టుకోవాలని కాళ్లరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ గత ఎనిమిదేళ్లుగా తిరుగుతూనే ఉన్నాడు.కానీ పోలీసులు అతడి కేసును పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.

దీంతో పోలీసుల నిర్లక్ష్యపు సమాధానాలతో విసుగు వేసారిన ఇమ్రాన్.బైక్ చోరీ విషయం గురించి ఆలోచించడం మానేశాడు.

Telugu Bike, Bike Theft, Challan, Honda Cd Bike, Imran, Pakistan, Punjab Provinc

ఇలా రోజులు గుడుస్తుండగా అతడికి సడెన్ గా బైక్ చలానా నోటీసులు వచ్చాయి.తన హోండా సీడీ 70 బైక్ కు ఇప్పుడు చలానా రావడం చూసి అతడికి మైండ్ బ్లాక్ అయింది.చోరీకి గురైన బైక్ రే దొంగలు నెంబర్ ప్లేట్ తు మార్చి వాడటం లేదా విక్రయించడం చేస్తూ ఉంటారు.కానీ ఎనిమిదేళ్ల తర్వాత చలాన్ రావడంతో తన బైక్ ఇంకా ఉందనే ఆశ విక్రమ్ లో రేకేత్తింది.

దీంతో చలాన్ లో ఉన్న ఫొటోలను పరిశీలించగా.విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.

లాహోర్ లోని సబ్జరార్ పరిసరాల్లో పోలీసులే తన బైక్ ను వాడుతున్నట్లు చలాన్ ద్వారా తేలింది.దీంతో బాధితుడు వెంటనే చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్(సీసీపీఓ)కి ఫిర్యాదు చేశాడు.

ఎనిమిదేళ్ల క్రితం పోయిన తన బైక్ ను పోలీసులే వాడుతున్నారని, తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.దీంతో సదరు పోలీసులపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube