సమంత కోసం స్పెషల్ గిఫ్ట్ పంపి సర్ప్రైజ్ చేసిన నయనతార?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయన తార ( Nayanatara ) ఒకరు.

నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇప్పటికే హీరోయిన్గా అవకాశాలు అందుకొని అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే నయనతార సమంతకు( Samantha ) మంచి స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించారు.

ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.ఇక తరచూ సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ చాటింగ్ చేస్తూ ఉండడం మనం చూస్తుంటాము.ఇకపోతే నయనతార తాజాగా సమంతకు స్పెషల్ గిఫ్ట్ పంపి తనని సర్ప్రైజ్ చేశారు.

మరి సమంత కోసం నయనతార ఎలాంటి గిఫ్ట్స్ పంపించారు అనే విషయానికి వస్తే ప్రస్తుతం నయనతార ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన భర్త విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) తో కలిసి 9 స్కిన్ ( 9Skin ) ప్రొడక్ట్స్ అనే బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ బిజినెస్ ప్రారంభించడంతో తమ బిజినెస్ ను ప్రమోట్ చేయడంలో నయనతార కూడా బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ క్రమంలోనే నయనతార తన 9 స్కిన్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ సమంతకు ప్రత్యేకంగా పంపించారు.ఇలా సమంత కోసం నయనతార వీటిని పంపించడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తాను 9 స్కిన్ ఫేస్ ప్రొడక్ట్స్ వాడటానికి చాలా ఆత్రుతగా ఉన్నాను.9 స్కిన్ కి ఆల్ ది వెరీ బెస్ట్ నయనతార అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇలా ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఇలాంటి మంచి బాండింగ్ ఉండడంతో వీరిద్దరి అభిమానులు కూడా వీరి విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు