సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నయనతార ( Nayanatara ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.నయనతార గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నారు.
ఇక ఈమె దాదాపు 9 సంవత్సరాలు నుంచి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ప్రేమలో ఉంటూ గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ కవల పిల్లలు కూడా జన్మించారు.
ఈ విధంగా నయనతార పెళ్లి ( Marriage) జరిగి పిల్లలు ఉన్నప్పటికీ సినిమాలకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాకుండా ఎన్నో వ్యాపార సంస్థలను కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.అయితే తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ దంపతులు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.సోషల్ మీడియా వేదికగా నయనతార ఓడిపోయాను అంటూ పోస్టులు చేయడంతో ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేశారు.
ఇలా వీరి విడాకుల( Divorce ) గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై పరోక్షంగా నయనతార విగ్నేష్ ఇద్దరు కూడా స్పందించారు.ఇద్దరు ఎంతో చనువుగా ప్రేమగా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది అయితే తాజాగా సినీ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం జీవితంలో వీరిద్దరూ విడిపోరంటూ కామెంట్లు చేశారు.ఎందుకంటే నయనతార ఆస్తులు అన్నింటిని కూడా వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టేలా విగ్నేష్ సలహాలు ఇచ్చారట.దీంతో నయనతార తన ఆస్తులను పెట్టుబడులుగా పెట్టడమే కాకుండా ఆ వ్యాపార సంస్థలకు తన భర్తను సీఈఓ గాను ఫౌండర్ గాను నియమించారు.
ఇలా నయనతార ఆస్తులను విగ్నేష్ పెట్టుబడులుగా పెట్టించడంతో వీరిద్దరూ ఎట్టి పరిస్థితులలోను విడిపోరని తెలుస్తుంది.