నవ్వులు పూయించిన నయన్‌ అమ్మోరు తల్లి

నయనతార తమిళనాట వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తోంది.ఆమె సినిమాలు అక్కడ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

తెలుగులో కూడా అవి మంచి విజయాన్ని సాధించిన దాఖలాలు చాలా ఉన్నాయి.ఇప్పుడు నయనతార నటించిన మూకుత్తి అమ్మన్‌ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లి అనే టైటిల్‌ తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందుకు సంబంధించిన డబ్బింగ్‌ కూడా పూర్తి అయ్యింది.ఈ సినిమాను దీపావళి సందర్బంగా నవంబర్‌ 14వ తారీకున విడుదల చేయబోతున్నారు.

అమ్మోరు తల్లి టైటిల్‌ వినగానే సినిమా చాలా గాంభీర్యంగా ఉంటుందని అనిపిస్తుంది.కాని ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తేలిపోయింది.

Advertisement

అమ్మోరు తల్లితో కామెడీ చేయించే కొత్త ప్రయత్నంను దర్శకుడు చేశాడు.ఆర్‌జే బాలాజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చారు.

మంచి సందేశంతో పాటు సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నారు.నయనతార అమ్మవారిగా ఒక ఫ్యామిలీకి ప్రత్యక్ష్యం అవుతుంది.

ఆమె నిజంగా అమ్మవారు అని మొదట ఆ ఫ్యామిలీ నమ్మదు.కాని ఎప్పుడైతే తన మాయాలతో ఆ ఫ్యామిలీ కష్టాలను తీర్చుతుందో అప్పటి నుండి అమ్మ వారు అని నమ్ముతారు.

ఇక అమ్మ వారు దేవుడి పేరుతో జనాలను మోసం చేస్తూ పిచ్చి వారిని చేస్తున్న వారి గుట్టు రట్టు చేసేందుకు ఆ ఫ్యామిలీని ఉపయోగించుకుంటుంది.మొత్తానికి సినిమాను తమిళ మరియు తెలుగులు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా ఉంది.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

హాట్‌ స్టార్‌ లో ఈ సినిమా దీపావళి కానుకగా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.టాలీవుడ్‌ లో నయనతారకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో అమ్మోరు తల్లి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Advertisement

తెలుగు వర్షన్‌ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తాజా వార్తలు