మాకు సినిమాలు మాత్రమే కాదు మరో జీవితం కూడా ఉంది అంటున్న హీరోయిన్స్

ఎవరికైనా లైఫ్లో చాలా ప్రయారిటీస్ ఉంటాయి.ఒక టైం లో డబ్బు సంపాదించాలనే వ్యామోహం ఉంటుంది అందుకోసం చాలా కష్టపడతారు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కగానే కాస్త రిలాక్స్ అయ్యే ఆలోచన చేస్తారు దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు వేసుకుంటారు మళ్ళీ ఈ పరుగు మొదలు పెడతారు మళ్ళీ రిలాక్స్ అవుతారు ఇది కొంతమంది జీవితాలకు చాలా చక్కగా నప్పుతుంది.

 Nayan And Thapsee About Their Movies   ,nayanthara  ,taapsee Pannu, Kollywood,-TeluguStop.com

ఎందుకంటే వెళుతున్న ప్రయాణాన్ని ఆపడం ఒక కళ.ఆ ప్రయాణం మళ్లీ మొదలుపెట్టడం అనేది మరొక అద్భుతమైన కళ.ప్రస్తుతం ఒక ఇద్దరు హీరోయిన్స్ ఈ ఫార్ములా ని చేసి చూపిస్తున్నారు.తమకు సినిమాలు మాత్రమే కాదు పరుస్తున్న లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ రెండిటిని బ్యాలెన్స్ చేస్తాము అంటున్నారు అంతేకాదు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోము అని కరాకండిగా చెబుతున్నారు.

Telugu Kollywood, Nayanthara, Taapsee Pannu, Tollywood, Vignesh Shivan-Movie

ఈ లిస్ట్ లో నయనతార( Nayanthara ) గురించి ముందుగా చెప్పుకోవాలి.పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది నయన్.అందుకే తన పిల్లలకు అలాగే భర్తకు టైం ఇస్తూ మనసుకు ఎంతో నచ్చిన కథలను మాత్రమే చెయ్యాలని డిసైడ్ అయ్యిందట.ఏ పని చేసినా ముందుగా స్టేట్మెంట్ ఇచ్చే అలవాటు లేదు ఈ అమ్మడికి.

కేవలం ఆచరణలో చేసి చూపుతుంది అంతే.అందుకే ఇటీవల కాలంలో చాలా తక్కువగా సెలెక్టివ్ గా సినిమాలు చేయాలని కథలను వింటుందట.

అంతేకాదు ఆమె ప్రస్తుతం అన్ని భాషలలో కథలు విన్నా కూడా మనసుకు హత్తుకునే కథలను మాత్రమే ఎంచుకుంటుందట.ఈమె దారిలోనే వెళుతుంది మరొక హీరోయిన్ తాప్సి.

Telugu Kollywood, Nayanthara, Taapsee Pannu, Tollywood, Vignesh Shivan-Movie

ఇటీవల తన చిరకాల మిత్రుడు నీ వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పన్ను.సినిమా మాత్రమే నా జీవితం కాదు నాకు నచ్చినట్టుగా జీవించడం కూడా ఎంతో ముఖ్యం అంటుంది తాప్సి( Taapsee Pannu ).అయితే నయనతార లాగా ఈమె చాలా సాఫ్ట్ గా విషయాన్ని చెప్పదు ఉండదు ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది.తన దగ్గరికి కథలతో వెళ్లే వాళ్ళు ఆషామాషీ కథలను చెప్పకూడదంట మంచి కథ అయితే మాత్రమే వింటాను అంటుంది.

మొత్తానికి ఇటు సౌత్ లో నయనతార అటు నార్త్ లో తాప్సి ఇద్దరు ఒకే మాట మాట్లాడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube