సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.కొన్నిసార్లు పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు సంచలనాలు సృష్టించడంతో పాటు మంచి లాభాలను అందిస్తుంటాయి.
అలా ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో హాయ్ నాన్న మూవీ( Hi Nanna ) పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు.
తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ను చక్కగా చూపించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.వీక్ డేస్ లో కూడా ఈ సినిమా మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
అవినాష్ అడ్లూరి( Avinash Adluri ) అనే వ్యక్తి తన అన్న కూతురితో కలిసి ఈ సినిమాను థియేటర్ లో చూడటంతో పాటు సినిమా చాలా బాగుందని చూసిన వాళ్లందరినీ కదిలించిందని తెలిపారు.ఎంతోమంది తండ్రీకూతుళ్ల బంధాన్ని ఈ సినిమా బలోపేతం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇలాంటి సినిమాను ఎంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ అవినాష్ నానిని( Nani ) ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయగా ఈ విషయాన్ని నాని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఇది కదా ఆస్తి అని కామెంట్లు చేశారు.నాని చేసిన ఈ పోస్ట్ కు 3600కు పైగా లైక్స్ రాగా నానికి 2023 లక్కీ ఇయర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అవినాష్ తన కామెంట్ లో సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే నాన్న గుర్తుకొచ్చి శ్రేష్ట నన్నుహత్తుకుందని అన్నారు.
శ్రేష్ట ( Shreshta ) అలా చేయడంతో అక్కడ ఉన్న అందరి కళ్లు చెమ్మగిల్లాయని ఆయన తెలిపారు.ఇలాంటి మధుర జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు శౌర్యువ్ కు అవినాష్ అభినందనలు తెలియజేశారు.హాయ్ నాన్న ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
తర్వాత సినిమాలతో నాని మరో మెట్టు పైకి ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.