నాచురల్ స్టార్ నాని ( Nani ) తాజాగా దసరా సినిమా ( Dasara Movi e) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం నాని తన 30 వ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నాని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈయన బలగం సినిమాని చూశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బలగం సినిమా చూసినటువంటి నాని ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ కమెడియన్ వేణు (Venu) దర్శకత్వంలో ప్రియదర్శి( Priyadarshi) కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకుంది.అలాగే ఈ సినిమాకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు.తెలంగాణలోని మారుమూల గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున స్క్రీన్లను ఏర్పాటు చేసి గ్రామం మొత్తం ఈ సినిమాని వీక్షించారు.
అలాగే ఎన్నో సంవత్సరాలుగా మనస్పర్ధలు కారణంగా విడిపోయిన అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా కలుసుకున్నారు.
ఇలాంటి ఓ గొప్ప సినిమాని తాజాగా నాని చూశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నాని ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.నేను ఇంత ఆలస్యంగా బలగం సినిమా( Balagam Movie )ని చూశాను అంటే నమ్మలేకపోతున్నాను.
ఇంత మంచి సినిమాని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను.ఇది కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటినుంచో కోరుకుంటున్నది.
ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వేణు( Director Venu ) దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్.ఈ ప్రెస్టేజియస్ మూవీ కోసం నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ సినిమాలో మీరు నటించలేదని జీవించేశారు అంటూ ఈ సందర్భంగా నాని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.