కాన్సస్: MO: జూలై 25: భాషే రమ్యం సేవే గమ్యం అన్న స్ఫూర్తితో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.పేదల కడుపు నింపేందుకు ముందడుగు వేసింది.
జాతీయ స్థాయిలో పేదల కోసం ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్న నాట్స్.ఆ పరంపరలో భాగంగానే కాన్సస్ లో కూడా ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.
అన్నార్తుల ఆకలి తీర్చే ఈ కార్యక్రమానికి నాట్స్ సభ్యులు, తెలుగువారు ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేశారు.దాతలు, నాట్స్ కార్యకర్తలు కొండంత నిండు మనసుతో ఇచ్చిన విరాళాలతో ఆహారాన్ని సేకరించి హార్వెస్టర్స్ ఆహార బ్యాంకు ద్వారా అందించారు.
హార్వెస్టర్స్ అనేది కాన్సస్ సిటీ, టొపేకాతో సహా ఎన్.ఇ.కాన్సస్ ఎన్.డబ్ల్యూ మిస్సౌరీలో అవసరమైన కుటుంబాలకు సహాయం అందించే ప్రాంతీయ ఆహార బ్యాంకు.ఆకలి తీర్చడమే బ్యాంక్ ఆశయం.
ఎప్పటిలానే ఈ సంవత్సరం చేపట్టిన ఈ డ్రైవ్ లో కూడా తాము అనుకున్న దాని కంటే ఎక్కువగా విరాళాలు సేకరించగలిగామని నాట్స్ కాన్సస్ చాప్టర్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని నాట్స్ కాన్సస్ చాప్టర్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఇసుకపల్లి ఆధ్వర్యంలో చేపట్టారు. నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి, రవి గుమ్మడిపూడి , కాన్సస్ నాట్స్ జాయింట్ కోఆర్డినేటర్ గిరి చుండూరు, నాట్స్ కాన్సస్ కార్యవర్గం సభ్యులు భారతి రెడ్డి, శ్రీనివాస్ అబ్బూరి, శ్రీనివాస్ దామ, స్థా
.