అమెరికాలో ప్రతీ రెండేళ్ళ కోసారి నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ) ఆధ్వర్యంలో నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు అమెరికాలో ఉన్న ప్రతీ తెలుగు వారు తప్పకుండా హాజరవుతారు.అయితే ఈసారి ఈ సంబరాలకి ఇర్వింగ్ సిద్దమవుతోంది.
ఇర్వింగ్ లోని కన్వెన్షన్ సెంటర్‌లో మే 24, 25, 26 తేదీల్లో జరిగే ఈ సంబరాలకి ఎంతో మంది ప్రముఖులు రానున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంస్థలలో నాట్స్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఎన్నో విశేష సేవలందిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.అన్నీ ప్రాంతాల్లో నాట్స్ చాప్టర్ ద్వారా సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నామని ఈ వేడుకులకి ఎంతో మంది అతిరథ మహారథులు, సంగీత దర్శకులు కీరవాణితోపాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా వస్తున్నారని తెలిపారు.
అయితే ఈ సంబరాలకి ఫండ్ రైజింగ్ కార్యక్రమాలని కూడా విజయవంతంగా చేపదుతున్నామని చెప్పారు.ఈ క్రమంలో టెక్సాస్‌లో పార్క్ ప్లాజా టవర్స్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు.సుమారు 6 లక్షల డాలర్లను విరాళాలుగా ఇస్తామని ఈ కార్యక్రమాని విచ్చేసిన వారు ప్రకటించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.