నరేష్‌, పవిత్ర లోకేష్ పెళ్లికి ఉన్న ఆ ఒక్క అడ్డంకు ఏంటో తెలుసా?

సీనియర్ నటుడు నరేష్( Senior Actor Naresh ) మరియు పవిత్ర లోకేష్ వివాహానికి సిద్ధం అయిన విషయం తెలిసిందే.

కొత్త సంవత్సరం సందర్భంగా తామిద్దరం కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం అంటూ ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

ఇటీవల పెళ్లి వీడియో ఒకటి విడుదలై అందరిని సర్ప్రైజ్ చేశారు.ఇంతకు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది.

శారీరకంగా అయితే ఇద్దరు కలిసే ఉంటున్నారు.మానసికంగా ఎప్పుడో కలిసి పోయారు.

అయితే అధికారికంగా మాత్రం వీరిద్దరూ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

Advertisement

అందుకు కారణం మూడవ భార్య రమ్య రఘుపతి( Ramya Raghupathi ) తో నరేష్ విడాకులు ఇంకా పూర్తి కాలేదు.ఆమె కొడుకు విషయంలో ప్రస్తుతం కోర్టులో వాదోప వాదములు జరుగుతున్నాయి.నరేష్ కొడుకు అతడితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు అంటూ రమ్య రఘుపతి కోర్టులో ఫిర్యాదు చేసింది.

అందుకే విడాకుల కేసు ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.ఎప్పుడైతే ఆ విడాకుల కేసు( Divorce ) ఒక కొలిక్కి వస్తుందో అప్పుడు వెంటనే పవిత్ర లోకేష్ మెడలో నరేష్ అధికారికంగా మూడు ముళ్ళు వేసే అవకాశాలు ఉన్నాయి.

అంతే కాకుండా వీరి పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయించే వీలు కూడా ఉంటుంది.నరేష్ కొడుకు కారణంగానే పెళ్లి ఆలస్యం అవుతుంది అనేది ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం.ఆ కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు.

కనుక సినిమా రూపంలో తన పెళ్లి మోజును నరేష్ తీర్చుకుంటున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవిత్ర( Pavitra Lokesh ) మరియు నరేష్ ప్రేమ వ్యవహారం రోజుకో కొత్త వార్త అన్నట్లుగా మీడియా లో ఉంటూనే ఉంది.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

ముందు ముందు వీరు ఎలాంటి వార్తలతో మీడియాలో నిలుస్తారో చూడాలి.నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

ప్రస్తుతం మళ్లీ పెళ్లి అనే సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు.

తాజా వార్తలు