సీనియర్ నటుడు నరేష్( naresh ) ఈ మధ్య కాలంలో మీడియాలో తెగ హడావుడి చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం.మూడవ భార్య రమ్య రఘుపతి( Naresh third wife was Ramya Raghupathi ) కి విడాకులు ఇచ్చేందుకు నరేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆమె విడాకులు ఇచ్చేందుకు నిరాకరిస్తుంది.కానీ నరేష్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆమె నుండి విడాకులు కావాల్సిందే అంటూ పట్టబడుతున్నాడు.
త్వరలోనే వారికి విడాకులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.ఆ విషయాన్ని పక్కన పెడితే నరేష్ ఇప్పటికే సీనియర్ నటి పవిత్ర లోకేష్( Pavitra lokesh ) తో ప్రేమలో ఉన్నాడు.
ఈ ముదురు ప్రేమ చాలా దూరం వెళ్ళింది.ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వీరికి పరిచయమైంది.అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా అన్యోన్య దాంపత్యం అన్నట్లుగా కొనసాగుతున్నారు.నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఇటీవల కలిసి మళ్లీ పెళ్లి అనే తమ సొంత కథనే తీసుకొని సినిమా చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా వివాదాస్పదం అయ్యి ఈ జంట గురించి అసలు విషయాలు బయటకు వచ్చాయి.
నరేష్ మరియు పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం బాహాటంగా అందరికీ తెలిసి పోయింది.ఈ మధ్య కాలంలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ కలిసి పదే పదే ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి కనిపిస్తూనే ఉన్నారు.మళ్ళీ పెళ్లి సినిమా( Malli Pelli Movie ) ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు ఏ స్థాయిలో సందడి చేశారో అందరికీ తెలిసిందే.ఆ సినిమా నరేష్ స్వయంగా నిర్మించాడు.
కమర్షియల్ గా సక్సెస్ అవ్వక పోయినా కూడా నరేష్ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.అందులో కూడా పవిత్ర లోకేష్ తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇతర భాషల్లో సక్సెస్ అయిన కథలను తీసుకొని తెలుగు లో రీమేక్ చేసేందుకు నరేష్ ప్లాన్ చేస్తున్నాడు.వయసుకు తగ్గట్లుగా మంచి కథలు కాన్సెప్ట్ లో లభిస్తే తప్పకుండా ప్రధాన పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ నరేష్ పేర్కొన్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల లేటు వయసులో కూడా జంటగా నటించి కన్నుల ముందు చేసిన విషయం తెలిసిందే.అలాగే నరేష్ మరియు పవిత్ర లోకేష్ కూడా లేటు వయసులో జంటగా నటించి ప్రేక్షకులను అలరిస్తాం అంటూ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయబోతున్నారు.