సీఏఏ బిల్లుపై ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే.ముఖ్యండా ఢిల్లీలోని యూనివర్శిటీలో మరియు కొన్ని సున్నిత ప్రాంతాల్లో ఇంకా కూడా సీఏఏ ఆందోళనలు అల్లర్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ సీఏఏ అల్లర్ల వెనుక విద్రోహులు ఉన్నారని, దేశ ప్రగతికి మరియు దేశ ప్రయోజనాలకే దేశం పెద్ద పీఠ వేస్తుందంటూ మోడీ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా 2022 నాటికి ప్రతి ఒక్కరిని సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ ఈ సందర్బంగా మోడీ అన్నారు.ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంతో పాటు ఢిల్లీ అభివృద్దిలోముందుకు దూసుకు పోతుందని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఢిల్లీలో పలు సమస్యలు ఉన్నాయంటూ మోడీ పేర్కొన్నారు.
మోడీ ప్రచారంతో ఢిల్లీ బీజేపీ నాయకుల్లో జోష్ కనిపిస్తుంది.కాని సర్వేలు మాత్రం కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఉన్నాయంటున్నారు.