విడిపోనున్న టీడీపీ-బీజేపీ!!!

గత ఎన్నికల్లో కలసి మెలసి పోటీ చేసి మంచి ఫలితాలు సాధించిన తెలుగుదేశం-కమలం పార్టీలు ఇప్పుడు తమ మధ్య ఉన్న సంబందాన్ని తెంచుకోనున్నాయి.

అసలు ఏం జరిగింది అని అంటే.

కొంటొన్మెంట్ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆ రెండు పార్టీలకు ఘోర పరాజయం తప్పలేదు.ఇక దీన్ని సాకుగా చూపిస్తూ టీడీపీని దూరం చేయాలని బీజేపీ భావిస్తునట్లు సమాచారం.

తేదేపాతో పొత్తుగా వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు కమలనాధులు.ఇంతవరకు ఎలా ఉన్నా మరో పక్క మరో వాదన సైతం వినిపిస్తూ ఉంది.

కంటోన్మెంట్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగలేద‌ని అందువల్ల పార్టీ బలం తేలలేదని అదే ఈ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరిగితే అప్పుడే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెపుతున్నారు కొందరు నేతలు.త్వరలోనే ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ ఎన్నికలు ఉండడంతో వాటికి ముందు జరిగిన ఎన్నికలు కావడం తేదేపాతో పొత్తుతో వెళ్లినా కలిసి రాకపోవడంతో గ్రేటర్‌లో ఒంటరిగా పోటీ చేద్దామన్న భావనను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే హైదరాబాద్ లో ఇక్కడ సెటిలర్స్ ఓట్లు భారీగా ఉండడంతో తేదేపాతో పొత్తు విరమించుకుంటే తమకే నష్టం తప్పదని కూడా కమలం పార్టీ ఆలోచనలో పడినట్లు సమాచారం.మరి ఇంత వాదనల మధ్య ఏం జరగబోతుందో చూడాలి.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
Advertisement

తాజా వార్తలు