ఏపిలో రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో సిపిఐ పార్టీ నిబంధనల మేరకు నడుచుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడిపి చంద్రబాబు నాయుడు వచ్చ ఎన్నికల్లో అందరం కలిసి పోటిచేద్దాం అని అంటున్నారని.పవన్ కళ్యాణ్ ఎమో జగన్ హోహన్ రెడ్డి వ్యతిరేఖ ఓట్లు చీల్చకుండా ప్రయత్నం చేద్దామంటున్నారని నారాయణ అన్నారు.
ఏపిలో టీడిపి, జనసేన, బీజేపి కలిసి పోటీచేస్తాయని ఉహాగానాలు వస్తున్నాయని.దక్షిణ భారత దేశంలో బిజేపికి నమ్మకమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది వైసిపి ప్రభుత్వమేన్నారు.
బీజేపి వాళ్లు జగన్ ను ఓడించే ప్రయత్నం చేయరన్నారు.అధికార పార్టీ బస్సు యాత్ర విఫలమైందని నారాయణ అన్నారు, సీఎం జగన్ దావోస్ పర్యటన వలన రాష్ట్ర్ర ప్రజలకు ఎటువంటి ప్రయోసనం లేదని నారాయణ అన్నారు.