అమరావతి:ఉండవల్లి కరకట్ట వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.
తనిఖీలకు సహకరించిన లోకేష్.కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు.
మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ.కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసుల నిర్ధారణ.