ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు రాజధాని అక్కర్లేదు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం భావిస్తుందని, రాజధాని నిర్మాణంను ముందుకు సాగించే ఉద్దేశ్యం లేనట్లుగా వ్యవహరిస్తుంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంను, సీఎం జగన్‌ను ఉద్దేశించి నారా లోకేష్ సీరియస్ అయ్యాడు.
ప్రపంచ బ్యాంకు వారు అమరావతి కోసం సాయం చేసేందుకు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించలేదు.
ఈ విషయమై కేంద్రం పదే పదే రాష్ట్ర ప్రభుత్వంకు లేఖలు రాసింది.
వాటికి స్పందించక పోవడంతో పాటు, వారి మాటను కనీసం పట్టించుకోలేదు.దాంతో చివరి నిమిషంలో కేంద్రం సీరియస్ కూడా అయ్యింది.
ఎందుకు ప్రపంచ బ్యాంకు సాయంను ప్రభుత్వం తీసుకోవడం లేదని ప్రశ్నించాడు.మీకు వందల కోట్లతో ఇల్లు ఉండవచ్చు.
కాని రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి రాజధాని ఉండవద్ద అంటూ ప్రశ్నించాడు.అమరావతి విషయంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నారా లోకేష్ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.







