టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నారా లోకేష్..!!

నారా లోకేష్( Nara Lokesh ) పాదయాత్రలో ప్రతి ఒక్కరికి దగ్గరవుతున్నరు.ముఖ్యంగా టీడీపీ క్యాడర్ కి ఉత్సాహం కల్పించే రీతిలో నాయకుడిగా మంచి ధైర్యం అందిస్తున్నారు.

 Nara Lokesh With Family Of Tdp Activist Details, Nara Lokesh,tdp , Yuvagalam Pa-TeluguStop.com

పాదయాత్ర చేస్తూ ఒక పక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరోపక్క… పార్టీ కార్యకర్తలను నాయకులను ఒక తాటిపైకి తీసుకొస్తున్నారు.ఇదిలా ఉంటే కడప ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త( TDP Activist ) ఒకరు మరణించగా ఆ కుటుంబానికి లోకేష్ అండగా నిలబడటం జరిగింది.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.దీంతో వెంటనే సదరు  కుటుంబ సభ్యులను దగ్గరకు పిలిపించుకుని.

తొమ్మిది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అక్కడికక్కడే అందించారు.

మరణించిన పార్టీ కార్యకర్త భార్యకు ఉద్యోగం.కూతురిని చదివించే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది.ఇందుకు సంబంధించి వివరాలు సోషల్ మీడియాలో.

పొందుపరిచారు.తెలుగుదేశం కుటుంబం.

ఆదుకునే అనుబంధం…”తెలుగుదేశం పార్టీలో కార్య‌క‌ర్త నుంచి కార్య‌ద‌ర్శి వ‌ర‌కూ ఒక కుటుంబంగా భావిస్తారు.అభిమాని నుంచి అధ్య‌క్షుడి వ‌ర‌కూ క‌ష్ట‌సుఖాల‌లో పాలుపంచుకుంటూ సాయం అందిస్తారు.

ఇటీవల కడప పార్లమెంట్ ఐటిడిపి ప్రధాన కార్యదర్శి న‌ర‌సింహ చ‌నిపోగా, వారి కుటుంబాన్ని టిడిపి ఆదుకుంది.

త‌మకి అండ‌గా నిలిచిన టిడిపి ఆశాకిర‌ణం నారా లోకేష్ ని పాద‌యాత్ర‌లో క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది న‌ర‌సింహ కుటుంబం.ఐటిడిపి 2 లక్షలు, స్థానిక నాయకులు 2 లక్షలు, టిడిపి జాతీయ అధ్య‌క్షులు చంద్రబాబు 5 లక్షలు క‌లిపి మొత్తం 9 ల‌క్ష‌లు సాయంగా అందించారు.నరసింహ భార్యకి ఉద్యోగం, కూతురిని చదివించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను కుటుంబ‌స‌భ్యుల్లా భావించి ఆదుకోవ‌డం ఒక్క‌ తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమ‌ని మ‌రోసారి నిరూపించారు”.అని తెలియజేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube