రేపు సీఐడీ విచారణకు నారా లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.ఈ మేరకు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన రేపు ఉదయం విజయవాడకు రానున్నారు.

 Nara Lokesh To Be Investigated By Cid Tomorrow-TeluguStop.com

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు విచారణలో భాగంగా సీఐడీ ఎదుట లోకేశ్ హాజరుకానున్నారు.సెప్టెంబర్ 30న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఆర్పీసీ 41 (ఏ) కింద అధికారులు నోటీసులు ఇచ్చారు.

కాగా విచారణలో భాగంగా కీలక విషయాలపై లోకేశ్ ను సీఐడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది.ఈ క్రమంలో లోకేశ్ కు సీఐడీ పలు ప్రశ్నలు సంధించనుంది.

కేసుకు సంబంధించిన వాస్తవాలను ప్రశ్నించడానికి తమ వద్ద సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.కాగా ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube