అమరావతి: సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం నిరసన.వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు నిరసిస్తూ నిరసన.
సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత తదితర అంశాలపై ఆందోళన.
రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సి, ఎస్టి, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన నేతలు.