మీకు తెలుసా? అప్పట్లో ఇంటికి కాపాలాగా చిరుత పులులను పెంచేవారట!

ఈమధ్య ఎక్కడ చూసినా చిరుతలకు సంబంధించినటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.దీనికి గల కారణం తాజాగా మనదేశానికి కొన్ని చిరుతులను రప్పించడంతో వాటిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

 Do You Know At That Time, They Used To Raise Cheetahs To Guard The House, Cheeta-TeluguStop.com

ఇదిలావుంటే మన పూర్వీకులు వీటిని ఇంటి ముందు కట్టేసివుంచే వారని, వేట కోసం కూడా వాటిని ఉపయోగించేవారని పలు కధనాలు వెలువడుతున్నాయి.ఇళ్ల ముందు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్ని ఎలా అయితే కట్టేసి వుంచుతామో వాటిని కూడా అదేవిధంగా పెంచేవారని భోగట్టా.

ముఖ్యంగా వన్యప్రాణుల వేట కోసం వీటిని వినియోగించుకునేవారట. చీతాలను ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు.అయితే మధ్యలో ఇతర జంతువులను చూసినా, పెద్ద సంఖ్యలో మనుషులను చూసినా బెదిరి దాడి చేస్తాయన్న ఉద్దేశంతో వాటి కళ్లకు గంతలు కట్టేవారు.అడవిలోకి వెళ్లాక కళ్ల గంతలు విప్పి వన్యప్రాణులున్న వైపు వాటిని వదిలేవారు.

అత్యంత వేగంగా పరుగెత్తే చీతాలు.జింకలు, దుప్పులు వంటి జంతువులను వేటాడేవి.

ఆరకంగా మనుషులు ఆ జింకలు, దుప్పుల మాంసం తెచ్చుకునేవారట.అదే జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు తిరిగి పెట్టేవారు.

Telugu Cheetah, Latest, Security Guatd-Latest News - Telugu

రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రాన్ని కూడా పర్వీన్‌ పోస్ట్‌ చేశారు.బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాజస్థాన్‌ లో జింకలను వేటాడడానికి పెంపుడు చీతాలను తీసుకెళ్తున్న ఫొటోను, ఛత్తీస్‌గఢ్‌లో కింగ్‌ ఆఫ్‌ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొటోను కూడా పర్వీన్‌ పోస్ట్‌ చేశారు.భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్‌ చీతాలు అంతరించిపోయినట్టు 1952లో అధికారికంగా ప్రకటించింది.1972లో తొలిసారిగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టాన్ని తెచ్చింది.ప్రస్తుతం దేశంలో కొన్ని రకాల జంతువులు చీతాల్లా అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయని.వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే భవిష్యత్తులో వాటిని ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని పర్వీన్‌ కశ్వాన్‌ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube