మంగళగిరి: నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది.తన మీద వ్యక్తిగత విమర్శలు చేశారు.రాజకీయాల్లో కి రాకముందు కాంగ్రెస్ పార్టీ తన చదువు గురించి, స్టాన్ఫోర్డ్ చదివిన విషయం పై ఆరోపణలు చేసారు.
బాడీ షేమింగ్ చేయడం, భాష మీద ఆరోపణలు చేశారు.స్కిల్ డేవలప్మెంట్, ఏపీ ఫైబర్ లో, రాజధాని పై విషయంలో తన మీద ఆరోపణలు చేశారు.2919 ఎన్నికల తర్వాత కూడా ఇదే స్థాయిలో తన మీద ఆరోపణలు చేశారు.అందుకే వాళ్ల మీద పరువునష్టం దావా కేసులు వేశాను.
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో తాను 25లక్షల రూపాయలు ఫుడ్ కోసం ఖర్చు చేశానంటూ కొన్ని పేపర్స్ తప్పుడు వార్తలు రాసారు.
వాళ్ళ మీద 25కోట్ల పరువు నష్టం కేసు లో వాంగ్ములం ఇచ్చాను.
నా భార్య మీద నిరాధరణ ఆరోపణలు చేసారు.నా తల్లి పై కూడా వైసీపీ కార్యకర్త దేవేందర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు.
గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పై 50కోట్ల పరవు నష్టం దావా కేసు వేసాను.దానికి సంబంధించిన వాంగ్మూలం ఇచ్చాను.40ఏళ్ల రాజకీయ జీవితంలో నా కుటుంబం ఎప్పడు తప్పు చేయలేదు.ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయాలు చేసాం.
మా మీద చేసిన ఆరోపణలు చేసిన వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.నేను ఏ తప్పు చేయలేదు.
కచ్చితంగా వాళ్ల మీద న్యాయ పోరాటం చేస్తా.
ఎవరిని వదిలిపెట్టను.
సొంత బాబాయ్ ని చంపి. నారాసుర రక్త చరిత్ర అని రాశారు.
ఇప్పుడు ఎవరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు.బాబాయ్ హత్య కేసులో జగన్ ని కూడా విచారించాలి.
నేను చంచల్ గూడ జైల్ కి వెళ్ళలేదు.నా మీద చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ము ఉందా? సీఐడీ వైసీపీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లాగా తయారైంది.ఎన్నికల ముందు పిక్ డైమండ్ కొట్టేసామ్ అని విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేశారు.మరి ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు.







