వైసీపీ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు.
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి పాల దోపిడీ చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.మామిడి రైతుల నుంచి పెద్దిరెడ్డి కుటుంబం రూ.100 కోట్లు దోపిడీ చేసిందని విమర్శించారు.పుంగనూరులో రూ.500 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారన్నారు.నియోజకవర్గంలో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగిందని లోకేశ్ తెలిపారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక మదనపల్లిని జిల్లాగా చేస్తామని చెప్పారు.
పుంగనూరు అభివృద్ధి కావాలంటే టీడీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తేస్తామని స్పష్టం చేశారు.