ఈనెల 10 వరకు ఢిల్లీలోనే నారా లోకేశ్..!

టీడీపీ నేత నారా లోకేశ్ ఈనెల 10 వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత హస్తినకు వెళ్లిన లోకేశ్ గత 21 రోజులుగా అక్కడే ఉన్నారు.

ఈనెల 9న సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరగనుండటంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఈనెల 10వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే లోకేశ్ అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ కేసులో పలువురు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు