ఈ ఏడాది జనవరి 27వ తారీకు ప్రారంభించిన లోకేష్( Lokesh ) పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది.ఇప్పటికే 180 రోజులకు పైగా పాదయాత్ర చేసిన లోకేష్.
శనివారం నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది.ఈ క్రమంలో నేడు 2500 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ పాదయాత్ర చేరుకుంది.
ఈ సందర్భంగా తాడేపల్లిలో శిలాఫలకం ఆవిష్కరించారు.ఈ శిలాఫలకంపై టీడీపీ( TDP ) అధికారంలోకి వస్తే అసైన్డ్, అటవీ, రైల్వే ఇతర భూములలో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని అందులో పేర్కొనటం జరిగింది.
ఇదే సందర్భంలో మంగళగిరిలో పేదలకు 20వేల ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వటంతో జిల్లా టీడీపీ నేతలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలకడం జరిగింది.
గుంటూరు జిల్లాలో సైతం లోకేష్ పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలు ఓపికగా వింటున్నారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది అన్న విషయాలను.ప్రజలకు అర్థమయ్యే రీతిలో లోకేష్ వివరిస్తున్నారు.
అంత మాత్రమే కాదు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను స్థానిక నేతల అవినీతిని ఎండగడుతూ లోకేష్ పాదయాత్రలో దూసుకుపోతూ ఉన్నారు.