బాలయ్య శ్రీలీల కాంబినేషన్ లో భగవంత్ కేసరి( Bhagwant Kesari ) సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ హక్కులతో 70 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.
బాలయ్య శ్రీలీల సెట్స్ లో నిజంగానే తండ్రీ కూతుళ్లలా ఉన్నారని తెలుస్తోంది.బాలయ్య శ్రీలీలను ప్రేమగా అమ్మా అమ్మా అని పిలుస్తున్నారని తెలుస్తోంది.
బాలయ్య చూపిస్తున్న ప్రేమకు శ్రీలీల ఫిదా అయ్యారని సమాచారం అందుతోంది.బాలయ్య మంచితనం చూసి శ్రీలీల ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది.భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని బోగట్టా.బాలయ్య థమన్ కాంబినేషన్ ఇది నాలుగో సినిమా కావడం గమనార్హం.
ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కావడం గమనార్హం.
బాలయ్య రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా బాలయ్యను కొత్తగా చూపించడం కోసం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) చాలా కష్టపడ్డారని సమాచారం.ఈ సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.బాలయ్య భవిష్యత్తులో 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలవగా దసరా విన్నర్ గా కూడా బాలయ్య నిలుస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య భారీ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.భిన్నమైన కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ చేరడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య కథల ఎంపిక అద్భుతంగా ఉందని తెలుస్తోంది.