జగన్ అరాచకాలు ఇవే ? ఢిల్లీకి చినబాబు బృందం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో అడ్డూ, అదుపు లేకుండా జగన్ ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడని, తెలుగుదేశం పార్టీ మీద నాయకుల మీద ఎన్నో అరాచకాలు చేస్తున్నారంటూ తమ బాధను ఢిల్లీ పెద్దలకు చెప్పుకునేందుకు లోకేష్ ఆధ్వర్యంలో సుమారు పది మంది ఎంఎల్సీలు నేడు ఢిల్లీ కి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.జగన్ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అని, జగన్ పాలన పై ప్రజల సంతోషంగా లేరు అని ఢిల్లీ పెద్దలకు ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయబోతున్నారు.

మార్చి మూడో తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు, శాసనమండలి రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఏపీలో పరిస్థితులను గురించి కేంద్ర బిజెపి పెద్దలతో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి కి ఫిర్యాదు చేయాలని లోకేష్ బృందం ఈరోజు ఢిల్లీకి పయనమైంది.దీనికి సంబంధించి ఏపీ లో జగన్ పరిపాలన మొదలైన తర్వాత ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు కు సంబంధించిన అన్ని పత్రాలను వారి వెంట తీసుకు వెళ్తున్నారు.

అంతేకాకుండా ప్రభుత్వానికి శాసనమండలి ఏ విధంగా వ్యతిరేకం కాదు అన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పబోతున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ నుంచి 42 బిల్లుల మండలికి వచ్చాయని వీటిలో 38 బిల్లులను యథాతధంగా ఆమోదించమనే విషయాన్ని చెప్పబోతున్నారు.రెండిటికి సవరణలు ప్రతిపాదించి మరో రెండిటిని సెలెక్ట్ కమిటీకి పంపించామని విషయాన్ని చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.వైసీపీ ప్రభుత్వం టిడిపి ఎమ్మెల్సీ ల పై కక్ష సాధిస్తోందని వారంతా ఫిర్యాదు చేయబోతున్నారట.

Advertisement

ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అపాయింట్మెంట్ ఖరారు అవ్వడంతో మిగతా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇప్పటికే వారంతా టీడీపీ బృందానికి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం.

అయినా పట్టువిడవకుండా ప్రధాని మోదీ అపాయింట్మెంట్, అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం లోకేష్ బృందం ప్రయత్నాలు మొదలు పెట్టింది.వారిని కలిసి అన్ని విషయాలను వివరించిన తరువాత బిజెపికి టీడీపీ సన్నిహితంగా ఉంటుందని, జగన్ ను కట్టడి చేయాలనీ చెప్పే ప్రయత్నం కూడా చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు