టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్టుపై ఆయన తనయుడు టిడిపి( జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖలో అనేక అంశాలను లోకేష్ ప్రస్తావించారు.చేయని నేరానికి తన తండ్రిని అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం చూస్తే తన రక్తం మరిగిపోతుందని, ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలంటూ ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు .‘ నా తండ్రి ఎన్నడు చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి నాకు కోపం కట్టలు తెంచుకుంటుందని, రక్తం మరుగుతోంది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ , తెలుగు ప్రజల అభివృద్ధి కోసం మా నాన్న తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగా, లక్షల మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజు అంటూ తెలియదు.ఆయన రాజకీయాలు ఎప్పుడు హుందాతనంగా, నిజాయితీగా ఉంటాయి.సేవలను పొందిన వారు ప్రేమ కృతజ్ఞతలు నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూసా.
వాళ్ళ హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయి.అవి పిల్లల ఆనందానికి సమానమైనవి.
నేను ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్ కు తిరిగివచ్చా.ఇది కఠినమైన నిర్ణయమైనా, నాకు మన దేశం వ్యవస్థలు అన్నిటికీ మించి మన రాజ్యాంగం పై నమ్మకం ఉంది ‘ అంటూ లోకేష్ ( Nara Lokesh )పేర్కొన్నారు.

కక్ష సాధింపు చర్యలు ,యుద్ధ రాజకీయాలకు చంద్రబాబు >( Chandrababu )ఎప్పుడు పాల్పడలేదని, దేశం రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు.మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం అవకాశాలను ఆయన ఇతరుల కంటే ముందుగా ఊహించినందుకేనా అని ప్రశ్నించారు.బరువెక్కిన హృదయంతో కన్నీటితో తడిసిన కళ్ళతో ఈరోజు ఈ లేఖ రాస్తున్నానని లోకేష్ ( Nara Lokesh )తన ట్వీట్ లో పేర్కొన్నారు.







