మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన..
అలీనగర్ జామియా మస్జీద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దుగ్గిరాల గ్రామంలో పర్యటిస్తున్న నారా లోకేష్ దుగ్గిరాల గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న లోకేష్.
ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించిన లోకేష్.
దుగ్గిరాల లూధరన్ చర్చి లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న నారా లోకేష్.దుగ్గిరాల గ్రామంలో పారిశుద్ధ్య సమస్య, రోడ్ల అద్వాన స్థితి గురించి లోకేష్ కి వివరించిన మహిళలు.
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, చెత్త మీద కూడా పన్నేసి మోయలేని భారాన్ని మోపుతున్నారని తమ సమస్యలను వ్యక్తం చేసిన ప్రజలు.స్థానికంగా ఉన్న ఎస్సి కమ్యూనిటీ హాల్ ని అమూల్ పాల సేకరణ కేంద్రంగా మార్చాలని చూస్తున్నారు.
దీని వలన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి వస్తుందని లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు.
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బ్రతకడం కష్టంగా మారిందని తమ కష్టాన్ని చెప్పుకున్న ఆటో డ్రైవర్లు.
ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఓనర్లకి మాత్రమే ఇస్తున్నారు.డ్రైవర్లకు రావడం లేదు.
పైగా వేస్తున్న చలాన్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్న ఆటో డ్రైవర్లు.ఇతర కారణాలు చెప్పి వృద్ధాప్య, వితంతు పెన్షన్లు కట్ చేస్తున్నారు.3 వేల పెన్షన్ అని రెండున్నర ఏళ్లు అయినా రూ.250 మాత్రమే పెంచారని లోకేష్ కి చెప్పి బాధపడిన వృద్ధులు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్న లోకేష్.30 మంది కార్యకర్తల నివాసాలకు వెళ్లి పరామర్శించిన లోకేష్.