అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏ14 గా పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.ఈ మెమోలో ఈ విషయాన్ని సీఐడీ ప్రస్తావించింది.
ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీమంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.అయిటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్పులు చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ లో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.







