స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ( Chandrababu Naidu ) అరెస్ట్ అయిన నాటి నుండి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ప్రజలకు తెలియజేస్తూ పార్టీ కేడర్ కి అందుబాటులో ఉంటున్నారు.
ఇదే సమయంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు.ధైర్యం చెబుతూనే త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని భరోసా ఇస్తున్నారు.
అంతేకాకుండా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపడుతున్న అనేక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలో “నిజం గెలవాలి”( Nijam Gelavali ) అనే నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది.
ఈ “నిజం గెలవాలి” నిరసన కార్యక్రమంతో ప్రజల మధ్యకు నారా భువనేశ్వరి వెళ్తూ చంద్రబాబు అరెస్టు తీరును ప్రజలకు తెలియజేస్తున్నారు.

తాజాగా చంద్రగిరి నియోజకవర్గం( Chandragiri ) ఆగరాలలో నిర్వహించిన “నిజం గెలవాలి” కార్యక్రమంలో నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.మహిళల కోసం చంద్రబాబు 22 పథకాలు ముందుకు తీసుకురావడం జరిగింది.మొన్న మహానాడులో “మహాశక్తి”( Maha Shakthi ) అనే పథకాన్ని ప్రకటించడం జరిగింది.
చంద్రబాబు గారు ఇప్పుడు బయట ఉండి ఉంటే దసరాకి మహిళలకు మరిన్ని పథకాలను ప్రకటించేవారు.అయినా ఆలస్యం ఏమీ కాలేదు.ఈరోజు కాకపోతే రేపు నిజం గెలుస్తుంది.చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వస్తారు.
రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని విమర్శలు చేశారు.వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిపై ధ్యాస లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబుని ఇరికించారు.రాష్ట్రాన్ని న్యాయాన్ని జైల్లో పెట్టారు.
తెలుగువారి పౌరుషం ఏంటో ఆ నాడు ఎన్టీఆర్ రుజువు చేశారు.ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళ్దాం అంటూ “నిజం గెలవాలి” సభలో నారా భువనేశ్వరి ప్రసంగించారు.







