ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. నాని టీమ్ సంచలన పోస్ట్ వైరల్!

టాలీవుడ్ హీరో నాని( Nani ) దసరా సినిమాలో ఊర మాస్ అవతారంలో కనిపించిన విషయం తెలిసిందే.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఎప్పుడు చూపించని ఒక మాస్ అవతారంలో నానిని చూపించారు.

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది.

నాని అలాగే శ్రీకాంత్ కాంబినేషన్లో ప్యారడైజ్( Paradise Movie ) అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.హీరో నాని ఈ సినిమా విషయంలో ఆసక్తిగా లేరని, అలాగే బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడంతో సినిమా ఆగిపోయింది అంటూ చాలా రకాల వార్తలు వినిపించాయి.

Nani The Paradise Team Shutdown The Rumours Details, Nani, Paradise, Paradise Te
Advertisement
Nani The Paradise Team Shutdown The Rumours Details, Nani, Paradise, Paradise Te

అయితే తాజాగా ఈ వార్తలన్నింటిపై మూవీ టీమ్ కాస్త ఘాటుగానే స్పందించింది.ఇలాంటి రూమర్స్‌ సృష్టించేవారిని జోకర్స్‌ తో పోలుస్తూ ఒక పోస్ట్‌ కూడా పెట్టింది.ఈ మేరకు ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.

ది ప్యారడైజ్‌ సినిమా పనులు అనుకున్న విధంగానే జరుగుతున్నాయి.దీన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో త్వరలోనే చూస్తారు.

అప్పటి వరకూ మీరంతా ఇలాంటి రూమర్స్ క్రియేట్‌ చేస్తూ బతికేయండి.ఎందుకంటే ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా! మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను గమనిస్తున్నాము.

Nani The Paradise Team Shutdown The Rumours Details, Nani, Paradise, Paradise Te

అలాగే దీనిపై నిరాధారమైన వార్తలు సృష్టించేవారిని గమనిస్తున్నాము.వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాము.టాలీవుడ్‌ చరిత్రలోనే ది ప్యారడైజ్‌ గర్వించ దగ్గ సినిమా అవుతుంది.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ములక్కాయ‌ తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే?

ఇలాంటి రూమర్స్‌ ప్రచారం చేసేవారంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకువస్తారని వాగ్దానం చేస్తున్నాము అని పోస్ట్ లో రాసుకొచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల నాని కూడా ఒక సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.

ప్రతి సన్నివేశం ఆసక్తి రేకెత్తిస్తుంది.ప్రేక్షకులు ఊహించలేని ఎన్నో ఎలిమెంట్స్‌ ఉంటాయి.

దసరా సినిమా ఇంటర్వెల్ సీన్‌ కు 10 రెట్లు పవర్‌ ఫుల్‌ గా ఉంటుంది అని తెలిపారు హీరో నాని.

తాజా వార్తలు