నాని, శ్రీకాంత్ ఓదెల, SLVC కాంబినేష‌న్‌లో `దసరా` చిత్రం ఘనంగా ప్రారంభమైంది

నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు, ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రజెంట్ చేయ‌బోతున్నాడు.శ్యామ్ సింఘ రాయ్ విజయంతో వున్న నాని ఇప్పుడు మొద‌టిసారి శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో ద‌స‌రా చిత్రం చేస్తున్నాడు.

 Nani Srikanth Odela Slvcs Dasara Launched Grandly-TeluguStop.com

సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాకు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.క‌థా నాయిక‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ న‌టించ‌ నుంది.

దసరా చిత్రం ఈరోజు (బుధ‌వారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు.

ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచాన్ చేయగా, నాని, కీర్తి సురేష్ క్లాప్ కొట్టారు.తిరుమల కిషోర్, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల చిత్ర స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు.

గోదావరిఖని లోని సింగరేణి కోల్ మైన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథలో నాని మాస్ అండ్‌ యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు.దసరా కుటంబ‌ క‌థ డ్రామాగా రూపొందు తోంది.

అంతే కాక దసరా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్ర ఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య తారాగణం.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి, 2022 నుండి ప్రారంభమవుతుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు.

Nani, Srikanth Odela, SLVC’s Dasara Launched Grandly, Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab - Telugu Keerthy Suresh, Nani, Sai Kumar, Samuthirakani, Slvcsdasara, Srikanth Odela, Zarina Wahab

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube