'హాయ్ నాన్న' నుండి క్లీన్ అండ్ బ్యూటిఫుల్ టీజర్.. రిలీజ్ డేట్ కూడా ఫైనల్!

దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని.

అప్పటి నుండి వరుస సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

అలానే కంటెంట్ ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ ఇది వరకు కంటే బెటర్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.నాని ప్రస్తుతం హాయ్ నాన్న( Hi Nana ) చేస్తున్నాడు.

ఇది తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.ఆ తర్వాత వెంటనే రెండు సాంగ్స్ రిలీజ్ చెయ్యగా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండి ఆడియెన్స్ ను అలరిస్తుంది.ఈ టీజర్ మొత్తం తనకు తన కూతురుకి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ మాత్రమే కాదు హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) తో ఉన్న లవ్ ట్రాక్ కూడా చూపించారు.

Advertisement

ఇక ఫన్ అండ్ ఎమోషనల్ గా ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.నాని సూపర్ కూల్ లుక్స్, మృణాల్ తో లవ్ ట్రాక్ లో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

ఇక ఈ టీజర్ లో నాని( Nani ), మృణాల్ మధ్య లిప్ లాక్స్ కూడా చూపించిగా టీజర్ ఆద్యంతం ప్రామిసింగ్ గా ఆకట్టుకుంది.

అలాగే డిసెంబర్ 22న ఈ సినిమాను పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇంతకు ముందు తెలిపారు.కానీ ఇప్పుడు సలార్ అదే డేట్ కు రావడంతో ఈ సినిమాను ప్రీపోన్ చేసి డిసెంబర్ 7కి ఫిక్స్ చేసారు.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) కీ రోల్ పోషిస్తున్నారు.

వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.దసరా హిట్ ను నాని హాయ్ నాన్న సినిమాతో కొనసాగిస్తాడో లేదో చూడాలి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు