నాని వేలు పెట్టాడట!

యువ హీరో నాని ఈ వారం ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.

14 రీల్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు అనీల్‌ సుంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మించారు.‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హను తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇక ఈ సినిమా కథ మరియు స్క్రీన్‌ప్లేలో నాని వేలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

నాని గతంలో దర్శకత్వం శాఖలో వర్క్‌ చేసిన విషయం తెల్సిందే.

Advertisement

ఆ అనుభవంను నాని ఈ సినిమాకు ఉపయోగించాడట.ఈ విషయాన్ని స్వయంగా నాని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాను స్క్రిప్ట్‌ మేకింగ్‌లో దర్శకుడు హను రాఘవపూడికి సలహాలు సూచనలు ఇచ్చాను అని, ఆయనకు కూడా నేను ఇచ్చిన సలహాలు నచ్చడంతో వాడేశాడు అంటూ నాని చెప్పుకొచ్చాడు.నాని గతంలో నటించిన సినిమాలకు కూడా సలహాలు సూచనలు ఇచ్చాడు.

అయితే అప్పుడు మాత్రం పెద్దగా చెప్పింది లేదు.కాని ఈ సారి స్వయంగా నాని ఈ సినిమాకు నా సలహాలు ఉన్నాయి అని చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది.

ఈనెల 12న భారీ భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు